విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ పట్టణంలో 19వ మరియు 20వ వార్డులో గడపగడపకు వైఎస్ఆర్ పార్టీ బలోపేతం భాగంగా నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పర్యటించారు.వార్డులలో వున్న అనేకమందిని కలుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలు గురించి ప్రజలకి వివరిస్తూ 2024లో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ముందుగా వార్డులో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో వెంట వార్డు కౌన్సిలర్ కొండేపూడి సురేష్,పట్టణ చైర్ పర్సన్ శ్రీమతి గాదంశెట్టి శ్రీదేవి,పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్,మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చింతపల్లి నాగేశ్వరావు మరియు వార్డు కౌన్సిలర్లు,నియోజకవర్గ నాయకులు,వాలంటీర్స్,గృహ సారధులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు