WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆంధ్రుల గొప్ప చారిత్రక విజయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విజయం సాధించిన కూటమి ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు…ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడం అభినందనీయం

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్,

ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థులకు గొప్ప విజయం అందించారని టిడిపి ఎస్.సీ.సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి (కాకినాడ),జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం అన్నారు.గురువారం రాజమండ్రి దేవిచౌక్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడం అభినందనీయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల వద్దకు వస్తే 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకి అధికారం ఇవ్వడం పట్ల బాధ్యతగా భావిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ప్రతి నాయకుడు నెరవేర్చి,సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.ఎన్నికలలో విజయం సాధించిన టిడిపి, జనసేన, బిజెపి ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే కళ్ళు నెత్తికెక్కి నాయకులు ప్రవర్తించారని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని అధికారం కట్టబెట్టిన ప్రజలకు రాక్షస పాలన అందించారని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టి తో మంచి పాలను అందిస్తారని అన్నారు.రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య ,ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తే తమ కాళ్ళ మీద తమ నిలబడతారని అన్నారు. ప్రజలు ఎప్పుడు ఉచితల కోసం ఎగబడే వారు కాదని అన్నారు.అప్పులు చేసి బటన్ నొక్కడం ధ్యేయంగా జగన్ పాలన అందించారని అన్నారు. ఈ పాలను చూసి విసిగిపోయిన ప్రజలు తగిన తీర్పుతో గుణపాఠం చెప్పారని అన్నారు.జగన్ పాలనలో దళితులను అణగద్రొక్కారని అన్నారు.‌ వారికి కేటాయించవలసిన సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించారని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యను సైతం తన పేరు మీద మార్చాడని అన్నారు. ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్లా మార్పు రాలేదని అన్నారు. దళిత బిడ్డలను గంజాయి, గుడుంబాలకు అలవాటు చేసి దళిత జాతిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీల పథకాలు రద్దు చేసినవి తాను తిరిగి అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు చంద్రబాబునాయుడు అని కొనియాడారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement