WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయండి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఈ.వి.ఎంల పనితీరు పై అనుమానాలు .
– మోడీ ఈ.వి.ఎం లతో ప్రజాస్వామ్యం గెలవలేదు.
యావత్ భారతదేశంలోనే కేటాయించిన ఎన్నికల గుర్తును ప్రచారం మధ్యలో మార్చేసిన ఘటన రాజమండ్రి పార్లమెంట్ స్థానం లోనే జరిగింది.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

పురందేశ్వరి ఎన్నిక చెల్లదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు .

2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించటంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని,అనేక అధికార దుర్వినియోగ చర్యలకు పాల్పడిందని , గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడు ఇలాంటి ఎన్నికల నిర్వహణ వుండలేదు, వినలేదు అని , ఇప్పుడు జరిగిన ఎన్నికలు పచ్చి బూటకపు ఎన్నికలని,

ఈ ధఫా ఎన్నికల్లో ఓటు ఓటరు , వేసుకున్నాడో
ఈ వి ఎం ఆటోమెటిక్ ప్రోగ్రాం ద్వారా కట్ ఆఫ్ ఓట్లు వేసుకున్నాయో ననే అనుమానాలు ఓటర్లను వెంటాడుతున్నాయని , ఎన్నికల సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదు కాబడినా ఏ ఒక్క పిర్యాదు పైనా నేటికీ స్పందించకపోవటం ఓటర్లు దురదృష్టంగా బావిస్తున్నారని ఆయన తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు.

దేశ వ్యాప్తంగా అనేక పోలింగ్ స్టేషన్ల లో ఈ వి ఎం లు మోరాయించాయని , ఈ దఫా ఎన్నికల నిర్వహణలో ఓటుకు పెద్దగా గొప్యత లేకుండా పోయిందని ,
ఈ వి ఎం లలో పోలయ్యిన ఓట్లు సంఖ్యకు , పోటి చేసిన అభ్యర్థులకు పోలయ్యిన ఓట్ల సంఖ్యను మొత్తంగా లెక్కపెడితే అనేక చోట్ల కూడికలు తేడా వచ్చినవని , కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారుల అవకతవకలను ప్రశ్నించినా , జరిగిన సాంకేతిక మోసాన్ని గుర్తించినా అలాంటి వారికి కొన్ని ఓట్లు కలుపుతున్నాం అంటు విచిత్రమైన విధులు నిర్వహించిన ఘటనలు ఎదురైయ్యాయని , అలాంటి ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదులు కూడా దాఖలు కాబడినట్టు తెలుస్తున్నాయని , ఎన్నికలు ప్రజా స్వామ్య బద్దంగా జరగలేదని , తూ తూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించి మమా అనిపించేసారని , ముందస్తు వ్యూహంలో భాగంగా బలహీనంగా వున్న ప్రాంతాల్లో అనర్హులను సైతం గెలిచినట్టు అధికారిక ప్రకటన జరిపి ప్రజాస్వామ్య ఎన్నికలను పూర్తిగా కలుషితం చేసేసారని , ఈ అతిపెద్ద ఎన్నికల మోసాన్ని భహిర్గతం చేయగల నేర పరిశోధన సంస్థ భారతదేశం లో లేకపోవటం బాదాకరమని , ఎన్నికల కుట్రలో భాగంగానే మోడీ సర్కార్ ఎన్నికల నిర్వాహణ పేనల్ లో ముగ్గురు సభ్యుల్లో ఒకరైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని తొలగించి ఆ స్థానంలో మోడీ కేబినెట్ లో  మంత్రిని నియమించారని, ఇదంతా వ్యూహత్మకంగానే ముందుగా ఎన్నికల సంఘాన్ని మోడీ సర్కార్ కంట్రోల్ లోకి తీసుకుని ఎన్నికల మోసాలకు పాల్పడ్డారాని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు.

భారతదేశంలో ఈ వి ఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ నడుస్తున్న న్నాళ్ళు మోదీ ని గెలవటం అంత సునాయాసం కాదని , మన భారత్ లో ఎన్నికలను నడిపించేది , భారత్ పాలనను తెర వెనుక నుండి శాసించేది కొన్ని కార్పొరేట్ శక్తు లేనని , పేరుకు మాత్రమే భారతదేశంలో ఎన్నికల సంఘం విధులు అని , కాంగ్రెస్ పార్టి , ఇతర జాతీయ పార్టిలు , కొన్ని అధికార ప్రాంతీయ పార్టిలు తేలు కుట్టిన దొంగలు వలే మోనం గా ఉండటం చూస్తుంటే వారు కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలు బొమ్మలే ననే అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయని , 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు సైతం ఈ వి ఎం ల పనితీరు పై ఆరోపణలు చేసారని , బ్యాలెట్ ఓటింగ్ ప్రవేశ పెట్టె వరకు భారత్ లో మోదీ ని గెలవటం ఎవరి వల్లా కాదని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం వారు రాజమండ్రి లో “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్లమెంట్ అభ్యర్థిగా పోటి చేసిన నాకు “గాజు గ్లాస్” గుర్తు కేటాయించారని ,
ఆ గుర్తుతో ప్రచారంలో వున్న నన్ను రెండు రోజులు అనంతరం నా ప్రమేయం లేకుండానే , నా వివరణ కూడా తీసుకోకుండానే నాకు కేటాయించిన గాజుగ్లాస్ గుర్తును రద్దు చేసేసారని , ఆస్థానంలో ఎన్నికల అధికారి నా ఇష్టం తెలుసుకోకుండానే “గ్యాస్ సిలెండర్”గుర్తును నాకు కేటాయించటం జరిగి పోయిందని ,అప్పటికే గాజుగ్లాస్ గుర్తుతో నేను విస్తృత ప్రచారంలో వున్నానని , ఓటర్లు నాకు ఎక్కువ శాతం మొగ్గు చూపుతారనే భయంతో ఎన్నికల సంఘం పై చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చి బారి మొత్తంలో అవినీతి ముడుపులు చేతులు మార్చి ఎన్నికల సంఘంతో అధికార దుర్వినియోగానికి పాల్పడే చర్యలు చేయించారని , తద్వారా పురందేశ్వరి అక్రమ గెలుపుకు సహకరించారని , యావత్ భారతదేశంలోనే కేటాయించిన ఎన్నికల గుర్తును ప్రచారం మధ్యలో మార్చేసిన ఘటన రాజమండ్రి పార్లమెంట్ స్థానం లోనే జరిగిందని , ఎన్నికల అక్రమాలకు ఇంతకంటే తర్కాణం ఉంటుందా ! అని , ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా వారి సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుందని, ఇలాంటి అక్రమాలు గత 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడు చూడలేదని, ఎన్నికల సంఘం అక్రమాలపై విచారణకు ఆదేశించి రాజమండ్రి పార్లమెంట్ ఎన్నిక విజయాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేసారు.

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .

ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , దూడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, ఎం డి హుస్సేన్, దూడ్డే త్రినాద్ ,జిత్తుక అప్పన్న , వాడపల్లి జ్యోతిష్, దోషి నిషాంత్ , కారుమూరి యుగంధర్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, కారుమూరి రత్నకుమారి, బసా సోనియా , ఖండవల్లి శ్రీనివాసరావు, సోర్నపూడి మహేష్ , లంక వీర వెంకట సత్యనారాయణ , శీరపు పురందేశ్వరి తదితరులు పాల్గొనియున్నారు.

–మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement