Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రామచంద్రపురంలో సిఐటియు డిమాండ్స్ డే కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురంలో సిఐటియు డిమాండ్స్ డే కార్యక్రమం

 

ప్రధాన డిమాండ్ గా కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జ్ నిర్మాణం

కనీస వేతనం 26000 పెంచాలి

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం -దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా డిమాండ్స్ డే ని రామచంద్రపురం మండలంలో పాత బస్టాండ్ నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, మండల సిఐటియు కన్వీనర్ ఎం.దుర్గమ్మ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణను,జాతీయ నగదు బదిలీకరణ పథకం లను ఆపాలని అన్నారు.అంగనవాడి, ఆశ,మధ్యాహ్నం భోజన పథకం,నేషనల్ హెల్త్ మిషన్,సమగ్ర శిక్ష, వెలుగు,మెప్మా ,ఉపాధి హామీ,ఆయుష్ ,సేంద్రియ వ్యవసాయం,108 ,104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు మరియు పెన్షన్ లాంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు.కనీస వేతనం నెలకు 26 వేలు చప్పున నిర్ణయించి అమలు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలి అని, ఇప్పటివరకు ఉన్న పెండింగ్ క్లయముల పరిహారాలు తక్షణమే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, కంటింజెంట్,పార్ట్ టైం,గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ రను ను తొలగించిన కార్మికులను తొలగించరాదని అన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉరితాడుగా మారనున్న భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలి అని అదేవిధంగా నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కోటిపల్లి ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మార్వో గారు సానుకూలంగా స్పందించి డిమాండ్స్ ను రాష్ట్రానికి ,కేంద్రానికి పంపుతానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి నాయకులు సూర్య కుమారి,జహీరా, దుర్గా,విజయలక్ష్మి మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ , ఆశ నాయకురాలు దేవి, హేమ మరియు ఆశ వర్కర్స్,మధ్యాహ్న భోజన కార్మికులు, ట్రాన్స్పోర్ట్ నాయకులు సత్తిబాబు,రమేష్, దొరబాబు పాల్గొన్నారు . బిల్డింగ్ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement