విశ్వంవాయిస్ న్యూస్, కాజులూరు:
కాజులూరులో నిరసన తెలియజేసిన ఉపాధ్యాయలు
జూనియర్ డాక్టర్ మోమిత పై దాడిని కండిస్తూ నినాదాలు
విశ్వం వాయిస్ న్యూస్ కాజులూరు వెస్ట్ బెంగాల్ లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరాసనగా కాజులూరు మండలం గొల్లపాలెంలో యుటిఎఫ్ ఆద్వర్యంలో భారీ నిరసన తెలిపి,నినాదాలు ఇచ్చిన ఉపాధ్యాయులు.
ఈకార్యక్రమంలో యుటిఎఫ్ మండల మహిళా అధ్యక్షురాలు డి.మిన్నీ కుమారి మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని ఖండించాలని,దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.అదేవిధంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లలో తల్లిని,చెల్లిని,కూతురుని చూడాలని,దోషులను శిక్షించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.
ఈ అకృత్యాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో 70 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా యుటిఎఫ్ మహిళా కార్యదర్శి అమ్మాజీ,జిల్లా కార్యవర్గ సభ్యురాలు గౌతమీ,ప్రధాన కార్యదర్శి గణేష్,అధ్యక్షులు భాను ప్రకాష్,జిల్లా సభ్యులు సాపే శ్రీనివాస్,మండల కోశాధికారి సుధీర్,దుర్గా ప్రసాద్,సత్యనారాయణ,రమేష్ మహిళా ఉపాద్యాయులు పాల్గొన్నారు.