విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఘనంగా మాతృమూర్తి మదర్ థెరిసా 114 జన్మదిన కార్యక్రమం
విశ్వం వాయిస్ న్యూస్ రాయవరం :-రాయవరంలో మదర్ థెరిస్సా 114వ జన్మదిన వేడుకలు మదర్ థెరిస్సా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు వెలగల ఫణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మదర్ థెరిస్సా యుగేస్లేవియా దేశంలో పుట్టి ఎదుటివారిలో దేవుని చూస్తూ ఆపదలో ఉన్న వారిని,కష్టాల్లో ఉన్న వారిని,ఆదుకుని శాంతి దూతగా పేరొందారని , కుష్టు రోగుల గాయాలు కడిగి మన భారతదేశం తరఫున నోబెల్ పురస్కారం అందుకున్నారని తెలియజేశారు.యువత కూడా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సేవాగుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
మదర్ థెరిసా జీవితం ఆదర్శంగా తీసుకోవాలని థెరిసా జీవితం కోసం మాట్లాడతు తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా అనారోగ్యంతో ఆయన 1919 సంవత్సరంలో మరనించిగా,ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గగురైన థెరిసా 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైనది.తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది.ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని స్కూల్‌కు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలిపోయిన ఆమె దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.
దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు,పేదలు,రోగులకు సేవలందించారు.అనేక అనాథ శరణాలయాలు,ధర్మశాలలు,హెచ్ఐవీ,కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది.1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక,భారత అత్యున్నత పౌర పురస్కారం 1980లో భారతరత్న ఆమెను వరించింది. థెరీసా సేవలు ఆసియా, ఐరోపా,ఆఫ్రికా,రోమ్, టాంజానియా,ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు.
కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు,శరణార్థులు, అంధులు,దివ్యాంగులు, వృద్ధులకు,మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు.వీటితో పాటు 1982లో ఇజ్రాయిల్,పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు.
1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.అయితే అదే సంవత్సరం తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు.ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది.తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్బుతాలను చేసేవారికి వాటికన్ సిటీ సెయింట్ ఘా ప్రకటిస్తుంది.ఇలా ప్రకటించాలంటే కనీసం రెండు అద్బుతాలు జరగాలి అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు.కడుపులో కణితితో బాధపడుతున్న ఓ బెంగాలీ గిరిజన మహిళను థెరిసా స్వస్థపరచడాన్ని ఆమె చేసిన మొదటి అద్భుతంగా 1998లో గుర్తించారు.అనంతరం మదర్ థెరిస్సా యూత్ సభ్యులు ప్రెసిడెంట్ చంద్రమళ్ళ సంజయ్ రాజు,వైస్ ప్రెసిడెంట్ దువ్వ చంద్రశేఖర్,కందుకూరి గంగరాజు,చంద్రమళ్ళ రాజు,పలివెల ప్రసాద్, గాఢా మసేన్,చిన్నా తదితరులు వృద్ధులు వితంతువులకు పండ్లను అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు,సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, లంక చందు,మందపల్లి నాగేశ్వరావు,చంద్రమళ్ళ యాకోబు,ముమ్మిడివరపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.