WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

 

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం పట్టణంలోని మోడరన్ హైస్కూల్ నందు అకడమిక్ డైరెక్టర్ ఆర్. ఉమాదేవి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఆసాంతం చూపరులను ఆకట్టుకున్నాయి.బాలకృష్ణుడు

మరియు గోపికల వేషధారణలో విద్యార్థులు అలరించారు.గుణ్ణం వీర్రాజు బృందం ప్రదర్శించిన కోలాటం ప్రదర్శన కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది.ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత లయన్ జి.వి.రావు మాట్లాడుతూ భారతదేశం కర్మభూమి అని,పుణ్యభూమి అని కొనియాడారు. ప్రపంచంలోనే

అత్యుత్తమ గ్రంథం భగవద్గీతను సాక్షాత్తు

శ్రీకృష్ణుడు బోధించడం భారతీయులందరికీ గర్వకారణం అని అన్నారు. అకడమిక్ డైరెక్టర్ ఆర్. ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల,ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన కలుగజేయుటకు శ్రీకృష్ణాష్టమి గొప్ప వేడుకని అన్నారు.కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఎం.చిట్టిబాబు, మోడరన్ స్టాప్, విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement