విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
నియోజకవర్గంలో ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి..
ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :నియోజకవర్గంలో సుమారు 82 ట్రాన్ ఫార్మర్ ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే
వేగుళ్ళ జోగేశర్వరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో కొత్తగా ఏర్పాటుచేసిన మూడు కొత్త ట్రాన్స్ ఫార్మర్ లను శుక్రవారం వేగుళ్ళ జోగేశర్వరావు ప్రారంభించారు. తొలుత రాయవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన వనం మనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రాయవరం ఎస్.సి పేట, గ్రామ పంచాయితీ, మెయిన్ రోడ్ లలో ఏర్పాటు చేసిన కొత్త ట్రాన్స్ ఫార్మర్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 82 ట్రాన్ ఫార్మర్ ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. రాయవరం గ్రామానికి ఐదు ట్రాన్స్ ఫార్మర్ లు అవసరం కాగా ప్రస్తుతం మూడు ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటుచేశామని వెల్లడించారు. త్వరలో మరో రెండు ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లు తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఏమున్నా అధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీడీవో కే నరేంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, వార్డ్ మెంబర్ లంక చందు, ఎంపీటీసీ గంటి రోజా, రాయవరం టిడిపి సీనియర్ నాయకులు ఉండవిల్లి రాంబాబు,
చల్లా సత్యనారాయణ, మల్లిపాల గోవిందు, మామిడాల వెంకన్నబాబు, గ్రామశాఖ అధ్యక్షులు వెలుగుబంట్ల గోపికృష్ణ, జనసేన నాయకలు దేవిశెట్టి కరుణ, బేరా దుర్గా ప్రసాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, నల్లమిల్లి రాజేష్ రెడ్డి, వల్లూరు శ్రీనివాస్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తదితర్లు పాల్గొన్నారు.