విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..
మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి దొర రాజు…
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: యువతి, యువకులు రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని మండపేట సీఐ పీ దొరరాజు విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ఉపాధ్యాయులు వరాహగిరి అధ్యక్షతన శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు ఎస్సై బుచ్చిబాబు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి దొరరాజు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించే విధంగా తెలియజేసారు. యువత రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా రహదారి భద్రతా నియమాలు వివరించారు. అలానే మాదక ద్రవ్యాలు వాడకం వల్ల వారికి జరిగే నష్టాలు, సెల్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థి, విద్యార్థునిలకు తెలియజేసారు. యువత 18 సంవత్సరాల నిండకుండా వాహనాలను నడిపితే ఎటువంటి చట్టాలు ఉన్నాయో, ఎటువంటి శిక్షలకు గురి అవుతారో సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ పోలీసులు సత్యవేణి, సురేఖ, మహిళా పోలీస్ వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.