విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
స్థానిక గౌతమఘాట్ లోని రివర్ బే రిసార్ట్స్ లో ప్రసాదరాజు సారధ్యంలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ హోటల్ పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల నడుమ ఆదివారం ప్రారంభమయింది. ప్రసాదరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి,అతిధులకు స్వాగతం పలికారు.కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి,నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్,రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ,అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై,ఆయా విభాగాలను ప్రారంభించారు.రివర్ బే అధినేత లెఫ్టినెంట్ జాస్తి మూర్తి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గన్ని కృష్ణ,కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి,మాజీ కార్పొరేటర్స్ కెఎన్ రావు బాబు,కురగంటి సతీష్,రేలంగి శ్రీదేవి,జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు,బిజెపి నాయకులు పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, కాలెపు సత్యసాయిరాం,కూటమి నాయకులు పాల్గొన్నారు. కెప్టెన్ పాయింట్ లో నాన్ వెజ్,ఆవకాయ్ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్ క్షత్రియ ఫుడ్స్ పక్షాన అందుబాటులోకి వచ్చాయి.