– ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టూడియో ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించాలి..
– ప్రముఖ హాస్యనటుడు గౌతమ్ రాజు
విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి
రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్:
సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో స్థిర పడేందుకు చర్యలు తీసుకుంటామని సినిమా ఆటోగ్రఫీ,టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమండ్రి షెల్టన్ హోటల్ లో 4 కే ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా టైటిల్ ను ఆవిష్కరించారు.ఈ చిత్రానికి నిర్మాతగా ముంజలూరి పవన్ కుమార్,దర్శకులుగా సాయివిజయ్ శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో నూతన నటీనటులు హీరోగా సందీప్, హీరోయిన్ గా కావేరి నటిస్తున్నారు.సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి టైటిల్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాలు చిత్రీకరణకు కోనసీమ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. గోదావరి తీరంతో పాటు రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాలు అనుకూలమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమాకు ప్రముఖ హాస్యనటులు గౌతమ్ రాజు నేతృత్వం వహించడం అభినందనీయమని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల ప్రేక్షకులు వల్లే సినిమాలు నిలబడతాయని పేర్కొన్నారు.రాష్ట్రంలోనే తొలి స్టూడియో ధవలేశ్వరం లో దుర్గా మూవీ టోన్ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గోదావరి తీరంలో ఎందరో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె విశ్వనాథ్,ఈ.వి.వి.సత్యనారాయణ, వంశీ వంటి ప్రముఖ దర్శకులు చిత్రాలను నిర్మించి విజయం సాధించారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే నైసర్గిక స్వరూపంలో పెద్దదైనప్పటికీ సినిమా నిర్మాణంలో సౌకర్యాలు లేవని అన్నారు. సినిమా నిర్మాణానికి అవసరమైన స్టూడియోలు పోస్ట్ ప్రొడక్షన్ వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడం లేదని వివరించారు. సినిమా పరిశ్రమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన అభిప్రాయం ఉందని,అలాగే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఉన్నారని తెలిపారు. నిర్మాత మండలితో చర్చించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందేందుకు కృషి చేస్తామని తెలిపారు.తూర్పులో టైటిల్ ఆవిష్కరించిన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.
సినిమా స్టూడియోకు స్థలం కేటాయించాలి:
ప్రముఖ హాస్యనటులు గౌతమ్ రాజు మాట్లాడుతూ గోదావరి తీరంలో ఎందరో దర్శికులు దాసరి నారాయణరావు,బాపు,ఈ.వి.వి. సత్యనారాయణ,కే. విశ్వనాథ్ వంటి ప్రముఖ దర్శకులు చిత్రాలు నిర్మించారని తెలిపారు.వారు నిర్మించిన చిత్రాలు విజయవంతంగా ప్రదర్శింపబడ్డాయని పేర్కొన్నారు. తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టూడియో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో టెక్నీషియన్లు,ఆర్టిస్టులు, కళాకారులు ఉన్నారని వివరించారు. టెక్నీషియల్ కు కళాకారులకు అవకాశాలు కల్పిస్తే సినీపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చిత్ర పరిశ్రమ ద్వారా 63 శాతం నిధులు వెళుతున్నట్టు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో సినిమా దర్శకులు సాయి విజయ్ శ్రీరామ్, నిర్మాత ముంజలూరి పవన్ కుమార్, హీరో సందీప్, హీరోయిన్ కావేరి,సహా నటీనటులు జర్నలిస్ట్ డి.శ్రీనివాస్,సహాయ నటి కావేరి కర్రి మరియు చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.