21 October 2025
Tuesday, October 21, 2025

స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మహిళా సాధికారతయే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే ముప్పిడి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

మహిళా సాధికారతయే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంను శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని బస్టాండ్ నందు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడం జరిగిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు మహిళా పక్షపాతి ప్రభుత్వమని అన్నారు.

               ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, కొవ్వూరు మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీరామ్, తెదేపా కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు గొర్రెల శ్రీధర్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్ కుమార్, కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, కొవ్వూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దాయన రామకృష్ణ, కొవ్వూరు మండల టిడిపి అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వరరావు,మాజీ జెడ్పిటిసి గారపాటి శ్రీదేవి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు గోపిశెట్టి భువనేశ్వరి, కొవ్వూరు పట్టణ జనసేన మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్య, జనసేన కొవ్వూరు పట్టణ అధ్యక్షులు డేగల రాము, కొవ్వూరు మండల జనసేన అధ్యక్షులు సుంకర సత్తిబాబు, చాగల్లు మండల జనసేన అధ్యక్షులు ఉప్పులూరి చిరంజీవి తాళ్లపూడి జనసేన అధ్యక్షులు గంట కృష్ణ, డి సోమలక్ష్మి, మానెల్లి నాని తదితర ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo