Friday, August 1, 2025
Friday, August 1, 2025

సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సుబ్రహ్మణ్యం హత్యపై సిట్ ఏర్పాటు పట్ల హర్షం: మహాసేన రాజేష్

 

 

విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ

గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పడాల అనంత సత్య ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదాంతం అందరికీ తెలిసిందే. ఈ హత్యపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి తిరిగి పూర్తి వివరాలను అందించాలని తీర్పు ఆదేశించడం పట్ల టీడీపీ నేత సరిపెల్ల రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రాజేష్ విలేకరులతో సమావేశం నిర్వహించి వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి హత్య ఉదంతంపై సిట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు చేయడం, లేకపోతే వారే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం వైసిపి వారికి పరిపాటిగా మారిందన్నారు. దళితులపై జరిగిన దాడులలో డాక్టర్ సుధాకర్, వీధి సుబ్రహ్మణ్యం, ఒక రిపోర్టర్కు శిరోమండనం చేయించడం ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. సుబ్రహ్మణ్యం హత్య చేసిన విధానంపై సిట్ వేసి అసలు హత్య వెనక ఎవరెవరున్నారు. ఏం జరిగింది అనేదానిపై కూటమి తీసుకున్న నిర్ణయాన్ని దళితులు తరుపున తాను స్వాగతిస్తున్నానని మహాసేన రాజేష్ మీడియాకు తెలియజేశారు. ఈ హత్యపై మొదటి నుంచి నిస్పక్షపాతంగా పోరాడుతున్న ముప్పాళ్ళ సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పలివెల రవి అనంత కుమార్, కొల్లాబత్తుల అప్పారావు, బండి సత్యనారాయణ ప్రజలు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo