28 October 2025
Tuesday, October 28, 2025

సుపరిపాలన లో తొలి అడుగు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సఖినేటిపల్లి మండలం

ఉయ్యూరివారి మెరకలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’కార్యక్రమంలో

 

బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లి బోయిన

 

టిడిపి మీడియాకు ఆర్డినేటర్ బోళ్ళసతీష్

సఖినేటిపల్లి మండలం విశ్వం వాయిస్ న్యూస్

కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరక మధ్య గ్రూపులో ఆదివారం నాడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాస్, సతీష్ బాబు ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఏడాది పాలనలోనే పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందని, పీఎం కిసాన్ పథకంతో పాటు నగదు జమవుతుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందన్నారు. ఈ విధంగా ‘ సూపర్ సిక్స్’ హామీల్లో ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతధా కృషి చేస్తుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. పల్లెల్లో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వారు తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, టిడిపి నాయకులు తాడి సత్యనారాయణ, చెల్లుబోయిన జయబాబు, చెల్లుబోయిన నాగబాబు, సుంకర అమర జ్యోతి కుమార్, సుంకర సూర్యనారాయణ, హరరాజు, సుధాకర్, సలాది దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo