సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం
టీడీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని గుర్తించి పరిష్కరించడం జరిగితుందని కాజులూరు మండల టీడీపీ అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి(డాక్టర్ బాబు) పేర్కొన్నారు. మండల కేంద్రమైన కాజులూరులో ఈమేరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేసి ఏడాది పాలనపై ప్రజాభిప్రాయల్ని, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ (పెద్ద), టీడీపీ నాయకులు ఎలుగుబంట్ల శ్రీనివాస్, యాళ్ల దొరబాబు, వాసంశెట్టి సూరిబాబు, బొండాడ మణికంఠ, వాసంశెట్టి నారాయణరావుపాల్గొన్నారు.