సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేయండి
ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
జూలై రెండవ తారీకు నుండి జరగబోయే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని -ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సూచించారు.ఐ పోలవరం మండలం పరిధిలోని మురమళ్ళ పార్టీ కార్యాలయం దగ్గరలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రేపటి నుండి ప్రతి గ్రామంలో మండల,గ్రామ అధ్యక్షులు,క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జి లు కలిసి ఇంటి ఇంటికి తీరుగుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నాయకులు,కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. గ్రామస్థాయిలో పూర్తికాని పనులను, మండల స్థాయి దృష్టికి తీసుకురావాలని అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు, రాష్ట కమిటీ మండల కమిటీ, గ్రామ కమిటి అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జి ,కో కన్వీనర్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.