ఆదాని ప్రీ పైడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరికిస్తూ ప్రజావేదిక వద్ద ధర్నా : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్ళు రాజబాబు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు, గొల్లపాలెం
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ, ప్రజలపై భారాలు వేసేందుకు సిద్ధమై స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను వ్యాపార సంస్థలు మరియు సామాన్య ప్రజానికం వ్యతిరేకించాలని కోరుతూ మంగళవారం కాజులూరు ప్రజా వేదిక ఆధ్వర్యంలో గొల్లపాలెం పవర్ సెక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఈ స్మార్ట్...