1840లో కారం తమ్మన్నదొర నాయకత్వం లోని బృందం 12 మంది బ్రిటిషు పోలీసులను హతమార్చి..ఈ ఘటన తరువాత 8సంవత్సరాల పాటు తమ్మన్నదొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తరవాత తమ్మన్న అదృశ్యమయ్యారు.
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేసారు.కారం తమ్మన్నదొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో టి.సాయిపుష్ఠ, ముచ్చిక భాస్కర్ కృష్ణంరాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్,...