విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట రావులమ్మ నగర్ లోనిగల భాష్యం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులచే ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల గోపికమ్మ, శ్రీకృష్ణుని వేషధారణలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఇది హిందువులకు ముఖ్యమైన పండుగని, శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారన్నారు. కృష్ణాష్టమి పండుగ భక్తి, ప్రేమ మరియు ఆధ్యాత్మికతలకు ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇంచార్జ్ గోవిందరాజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి,...
కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా, జగ్గంపేట హైస్కూల్ సమీపంలోని శ్రీ సోమలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కుంకుమపూజ, పంచామృతాభిషేకం, మండపారాధన, దుర్గా హోమం కార్యక్రమాలను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ శ్రీ సోమలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట గ్రామదేవతల్లో పెద్ద అమ్మగా భక్తులను రక్షిస్తూ కోరికలు తీర్చే మహిమగల కల్పవల్లి అని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె కొత్తూరు శివారు వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరేడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంధాలు సూచిస్తున్నాయని వారు అన్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనక దుర్గ అమ్మవారు శ్రావణ శుద్ధ వరలక్ష్మి వ్రతము సందర్భంగా అమ్మ వారికి సుమారు ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువ గల బంగారు హారం (బంగారు ఆభరణం) బహుకరించారు. ఆలయ భక్తులు ఇచ్చినటువంటి బంగారు వస్తువులు అన్ని కలిపి బంగారు హారం శ్రావణ శుద్ధ వరలక్ష్మి వ్రతము రోజు అమ్మవారికి బహుకరించడం విశేషం. కోరిన కోరికలు సిద్ధించే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన జే కొత్తూరు దుర్గమ్మ అమ్మవారికి నిత్యం వందలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు, ఆలయ చైర్మన్ మరియు ఆలయ కమిటి సభ్యులు, గుడి...
దుర్గమ్మ తల్లి ఆలయంలో వైభవంగా చండీహోమం, గణపతి హోమం
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన రామచంద్రపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 18 శక్తి పీఠాల ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ఉదయం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయిగుణశేఖర్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులోని వనదుర్గ అమ్మవారి ప్రాంగణంలో, మహా చండీ హోమం, గణపతి హోమం సహా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామానికి చెందిన బోధ శివ భద్ర రావు తన తప్పును తెలుసుకొని పరివర్తన చెంది క్రిస్టియన్ మతం వీడి తిరిగి సొంత ఇంటికి హిందూ ధర్మంలోకి సనాతన ధర్మం విలువలు సాంప్రదాయాలు తెలుసుకొని, మనం మన పూర్వీకులు హిందూ ధర్మంలోని పుట్టాము మన దేశం హిందువు దేశం హిందువుగా ఉంటేనే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే ధర్మ మార్గంలో నడుస్తాము మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి బుద్ధి కలుగుతుందని తెలుసుకొని కుటుంబ సమేతంగా హిందూ ధర్మం లోకి రావడం జరిగింది ,వారిని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ముందుగా సోమాలమ్మ తల్లి అమ్మవారి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో ఆదికాలం నుంచి గ్రామ దేవతగా పూజలు పొందుతున్న ముత్యాలమ్మ తల్లికి ఈ ఏడాది బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం ఉదయం గ్రామంలోని కన్యలతో కలిసి 108 మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.బోనాల సందర్భంగా మహిళలు కళశాలు నెత్తిపై పెట్టుకుని ఊరంతా ఊరేగింపుగా తిరిగి అమ్మవారి ఆలయం వద్ద బోనాలు సమర్పించారు. గ్రామస్తులంతా భాగస్వామ్యంగా పాల్గొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, పుష్పాల తోరణాలతో ఆలయం అందంగా శోభించగా, మహిళల మంగళ హారతులు, సంప్రదాయ డప్పులు, పల్లకీలు వేడుకకు మరింత ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, “ప్రతి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మండలం సీతానగరం వెలసిన శ్రీ ఏగులమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన సీతానగరం గ్రామదేవత ఏగులమ్మ అమ్మ వారు ఆదివారం శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లుతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను కూడా కూరగాయలతో అలంకరించారు. అనంతరం గ్రామంలో మహిళలందరూ అమ్మవారికి సమర్పించేందుకు ఊరేగింపుగా బయలుదేరి ఏగులమ్మ అమ్మవారికి సారే, చీర, నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.పాల్గొని ఈ కార్యక్రమంలో సీతానగరం ఏ గులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.