జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుద్యోగ యువత కోసం బడా అవకాశం వచ్చి చేరింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ శనివారం నాడు జగ్గంపేట గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరుగనున్నది. ఈ జాబ్ మేళా బ్రోచర్ ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వికాస పిడి లక్ష్మణరావు సారథ్యంలో గోకవరం రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వికాస పిడి లక్ష్మణరావు మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సుమారు 33 ప్రముఖ కంపెనీలు ఈ...