ఎరువులు విత్తన కొరత నివారణకు చర్యలు తీసుకోవాలి
వైసీపీ నాయకులు కలెక్టర్‌కు వినతి
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ
జిల్లాలో రైతులు ఎరువులు, విత్తనాలు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా కోరారు.వైసీపీ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా దాడిశెట్టి రాజా సారథ్యంలో మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,మాజీమంత్రి తోట నరసింహం తదితరులు పాల్గొని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు నీటి కొరత నివారించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.దాడిశెట్టి రాజా చంద్రబాబును “కరువు చంద్రబాబు”గా, లోకేశ్‌ను “రైతు...