- ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీలో 90మొక్కలు నాటీన వైనం.
- పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.
- ప్రకృతి బాగుంటేనే మనిషితో సహా జీవరాశుల న్నీ బాగుంటాయి.
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీ ఆవరణలో మానవత సంస్థ ఆధ్వర్యాన మంగళవారం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈసందర్బంగా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమన్నారు. ఈవిషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ప్రపంచంలో మానవుడు జీవించాలంటే ప్రకృతి సహకరించాలని, కానీ ఓజోన్ పొర దెబ్బతిని నేలతల్లి బాధపడుతోందని, తద్వారానే మనందరం ఎంతో ఇబ్బందికి గురవుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోందన్నారు....