అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ సిటీ
అక్రమ సంబంధం వలనేసామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, ట్రైనీ ఆదివారం హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడయిందని నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ వెల్లడించారు. ఈనెల 3వ తేదీన తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్యకు గురైన విషయం తెలిసిందే.మృతురాలు ములపార్తి మాధురి,నిందితుడు తలే సురేష్ మధ్య అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.నిందితుడు మృతురాలి ఆర్ధిక అవసరాలు నిమిత్తం దాదాపు రూ 7లక్షలు వరకూ ఖర్చు చేసినట్లు,నిందితుడి భార్య, మాధురి నుండి వేధింపులు భరించలేక...