కోజికోడ్‌లో అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో 9ఏళ్ల బాలిక మృతి
కలుషిత నీటిలో నివసించే అమీబా వల్ల అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి
మూడు రోజుల్లో తీవ్ర లక్షణాలతో బాలిక మరణం – నాలుగో కేసుగా నమోదు
వైద్య నిపుణుల సూచనలతో అధికారులు ప్రాంతాన్ని పరిశీలిస్తూ నివేదిక సిద్ధం
విశ్వం వాయిస్ న్యూస్, కేరళ
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రుల్లో, ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల కలిగే అరుదైన వ్యాధి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ బాలిక మృతికి కారణమని ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు.
తమరస్సేరీ ప్రాంతానికి చెందిన చిన్నారి, ఆగస్టు 13న జ్వరం, తలనొప్పి,嘘ంగా తిమ్మిరి వంటి లక్షణాలు చూపించడంతో, తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు....