కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
వేలాది పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం
పీ.డి.ఎస్.యూ ఆధ్వర్యం తల్లిదండ్రులుతో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన
ధర్నా ఏ.ఓ ఝాన్సీ కి వినతి పత్రం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లితండ్రులుతో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీ డీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ మాట్లాడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఆర్టీఈ 12(1)(సి)) కింద ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులపై ప్రభుత్వం ఘోరమైన నిర్లక్ష్యం చూపుతోందన్నారు.గత ప్రభుత్వం,నేడు కూటమి ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అవమానాలను ఎదుర్కొంటున్నారు. రామచంద్రపురం, మండపేట,రాయవరం, గంగవరం,కాజులూరు, కపిలేశ్వరపురం...