కొలంక కేశవస్వామికి వెండి కవచం బహుకరణ
రూ 7లక్షల విలువ చేసే వెండి కవచం అందజేత
విశ్వం వాయిస్ న్యూస్, కొలంక
కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ కేశవస్వామి వారికి క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం బహుకరించారు. ఈమేరకు శనివారం 7 లక్షల రూపాయలు విలువచేసే వెండి కవచాన్ని ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో దంతులూరి వెంకట విజయ గోపాలకృష్ణంరాజు కృష్ణవేణి దంపతులచే సంప్రోక్షణ అనంతరం ఆలయ అర్చకులకు అందజేశారు. దంతులూరి కుటుంబీకులైన సాధు కృష్ణ వర్మ, వెంకట సత్యనారాయణ రాజు, వెంకట నరసింహారాజు, విశ్వనాథ వెంకటకేశవరాజు, కృష్ణ వర్మ, వెంకటరాఘవరాజు, సుబ్బరాజు, వెంకటతిరుపతిరాజు ఆర్థిక సహకారంతో సంయుక్తంగా స్వామి వారికి అందజేశారు. ఈ సందర్భంగా సాదు కృష్ణవర్మ మాట్లాడుతూ...