విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
ఖాతాదారులకు విశేష సేవలను అందిస్తూ బ్యాంకు ను అభివృద్ధి పథంలో నడిపించడంలో విశిష్ట సేవలను అందించిన కొవ్వూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారాన్ని అందించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణను మంగళవారం కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం కలిసి దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాలం శ్రీనివాసరావు, మాజీ...