కొవ్వూరు నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నులు వారి సత్రం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు...
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
నూతన కార్యవర్గం నీతి నిజాయితీలతో పనిచేస్తూ సంస్థ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఉన్న నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా బాల దారి ఉమాపతి,తురగా విజయ భాస్కరరావు, తమ్మిర్సి అంజిబాబు, దివిలి సత్యవాణి, కడదారపు నాగమణి, కొల్లి సుజాత, ముప్పన లోకేశ్వర సాంబ శౌర్య, మాదిరెడ్డి కృష్ణవేణి, లచే ఏవో బాలకృష్ణ...