14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

క్రైమ్ వాయిస్

జూద క్రీడలపై జగ్గంపేట సర్కిల్ పోలీసులు కఠిన చర్యలు

45 మంది పేకాటరాయుళ్లకు జరిమానా విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట మరియు గండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 45 మందిని పోలీసులు అదుపులో కి తీసుకుని పెద్దాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రతి ఒక్కరిపై రూ.300 చొప్పున జరిమానా విధించి, మొత్తం రూ.13,500/- వసూలు చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్రాక్టర్ ట్రక్కుల దొంగల ముఠా అరెస్ట్

రూ. 5.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు ట్రాక్టర్ ట్రక్కులను దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 5,25,000 విలువైన దొంగిలించిన ట్రక్కులు, నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ ఇంజిన్, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.గత కొద్ది రోజులుగా గండేపల్లి మండలంలోని తాళ్లూరు, మురారి వంటి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి ట్రాక్టర్ ట్రక్కులు వరుసగా చోరీకి గురయ్యాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మరియు గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముమ్మరంగా గాలింపు...

గంజాయి డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తి ఫ్రీజ్

జగ్గంపేట సిఐ వై ఆర్ కె  దర్యాప్తులో బాపిరాజు అక్రమ ఆస్తి బహిర్గతం విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం, ఉప్పలపాడు గ్రామంలో గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన 0.84 ఎకరాల భూమిని పోలీసులు ఫ్రీజ్ చేశారు.కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ ఆదేశాలు మరియు సూచనల మేరకు పెద్దాపురం ఎస్‌డిపిఒ శ్రీ శ్రీహరి రాజు పర్యవేక్షణలో, జగ్గంపేట సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్థిక దర్యాప్తు (Financial Investigation) నిర్వహించారు.2025 మార్చి 4న జగ్గంపేట మండలంలోని జగనన్న కాలనీ వద్ద వనపర్తి బాపిరాజు మరియు ఇతరుల వద్ద నుండి 492.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, దీనిపై జగ్గంపేట...

జే.కొత్తూరు గ్రామ శివారులో పేకాట రాయుళ్లపై జగ్గంపేట పోలీసులు దాడి

నలుగురి వద్ద నుంచి రూ.10,250 నగదు స్వాధీనం జూదక్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె హెచ్చరిక విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు జిల్లాలో జూదక్రీడలు, క్రికెట్ బెట్టింగులు, బొమ్మా బొరుసు, కోతా బంతి, ఎత్తు లాట వంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ దిశగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సూచనలతో ఎస్సై రఘునందన్ రావు సిబ్బందితో కలిసి ఆదివారం జగ్గంపేట మండలం జే.కొత్తూరు గ్రామ శివారులో పేకాట దందాపై దాడి చేశారు.ఈ దాడిలో నలుగురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు...

గెద్దనాపల్లిలో ఈగల్ క్లబ్ అవగాహన

జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని గెద్దనాపల్లి గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో గురువారం ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ నిర్మూలన మత్తు పదార్థాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ వంటి అనుచిత చర్యలు ఎప్పటికీ సహించబడవు. అలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. మత్తు పదార్థాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒకసారి అలాంటి వాటికి అలవాటు అయితే అది జీవితాన్నే నాశనం చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా వెలిగేలా...

గండేపల్లి యువతి అదృశ్యం.. హైదరాబాద్‌లో ట్రేస్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్‌ )ఆదేశాల మేరకు మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై తక్షణ చర్యలు తీసుకుంటూ ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల అవివాహిత యువతి అనామిక ఆగస్టు 19న కనిపించకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటలకు గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు Cr.No. 254/2025 u/s ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ సాంకేతిక సహకారంతో, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, గండేపల్లి ఎస్‌ఐ శివ నాగబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కోటనందూరు, హైదరాబాద్ ప్రాంతాలకు గాలింపు దళాలను పంపారు. ఈ క్రమంలో యువతిని...

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి

జగ్గంపేట ఎస్సై టి. రఘునాథరావు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఇకపై సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్సై టి. రఘునాథరావు సూచించారు.ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కౌన్సిలింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రౌడీ షీటర్లు సమాజంలో మంచి వ్యక్తులుగా మారాలని, ఎటువంటి అసాంఘిక చర్యలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. మీరు అందరూ మార్పు చూపించాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించాలి. ఎవరైనా మళ్లీ అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించారు.రానున్న వినాయక చవితి పండుగలు శాంతియుతంగా, సఖ్యంగా జరగాలని కోరుతూ, ఎవరు అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లు సృష్టించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు

టీటీడీ వి ఐ పి టికెట్ల మోసం బట్టబయలు

నిందితుడుని అరెస్ట్ చేసిన జగ్గంపేట పోలీసులు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట తిరుమల తిరుపతి దేవస్థానం (టీ టీ డి )వి‌ఐ‌పి దర్శన టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, జూలై 10న జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ వ్యక్తిగత సహాయకుడు (PA) డి. శివ ప్రసాద్‌కు, వంశీ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి, “నేను ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. వి‌ఐ‌పి దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తాను. ఇందుకోసం ₹50,000 ఖర్చు అవుతుంది” అని చెప్పాడు. అలాగే ఆధార్ కార్డు వివరాలు పంపాలని కోరాడు.అతని మాటల్లో అనుమానం గమనించిన పీఏ వెంటనే ఎమ్మెల్యేకు...

గేదెల దొంగలను అరెస్ట్ చేసిన గండేపల్లి పోలీసులు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు–ఉప్పలపాడు రోడ్డులో, ఉప్పలపాడు గ్రామంలో నాలుగు పాడి గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను గండేపల్లి ఎస్‌.ఐ. శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.అశ్వరావుపేటకు చెందిన ఈ. చరణ్‌ (21), ఎన్‌.ఎన్‌. తిరుపతి (20), వి.ఆర్‌. కుమార్‌ (29), బి. వీరేంద్ర (19)లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించిన నాలుగు పాడి గేదెలు (విలువ సుమారు రూ.1,60,000), ఒక బడా దోస్త్ వాహనం, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జగ్గంపేట సీఐ వై.ఆర్‌.కె. శ్రీనివాస్ వెల్లడించారు.

జగ్గంపేట సర్కిల్ పరిధి లో జూద క్రీడలపై కఠిన చర్యలు

సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట     కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్ )ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడా క్రికెట్ బెట్టింగ్లు, కోడిపందాలు, బొమ్మ బొరుసు, గుండాటలు, ఎత్తులాట, కోతా బంతి వంటి జూద క్రీడలు జరగకుండా పోలీసు విభాగం కఠిన చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలో శనివారం గండేపల్లి ఎస్సై శివ నాగబాబు సిబ్బందితో కలిసి గండేపల్లి గ్రామంలో పేకాట రాయుళ్లపై దాడి చేసి 5 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,850 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే వెంటనే 100, 112, మొబైల్ నంబర్ 94407 96529, లేదా పోలీస్ వాట్సాప్...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo