విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరి గ్రామానికి చెందిన ఒక అవివాహిత యువతి ఆగస్టు 1 వ తేదీన మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో 249/2025 U/s ఉమెన్ మిస్సింగ్‌గా కేసు నమోదు చేయబడింది. ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్న జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఎస్ఐ శివ నాగబాబు, వారి సిబ్బందితో కలిసి అనేక కోణాలలో విచారణ చేపట్టి, ఆమెను హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి ట్రేస్ చేశారు.అదే క్రమంలో గండేపల్లి పోలీసు బృందం ఆ యువతిని అక్కడి నుండి తీసుకొచ్చి, పోలీసు ల పర్యవేక్షణలో బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్...
జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మండలంలోని గుర్రం పాలెం,రామవరం, రాగంపేట, నీలాద్రి రావు పేట గ్రామాలకు చెందిన నలుగురు యువకులు అల్లరి చిల్లరగా, రిఫ్రాఫ్ గ్యాంగ్‌లా తిరుగుతూ ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.ఈ సమాచారం ఆధారంగా జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ సంబంధిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. సత్ప్రవర్తనకు ప్రోత్సాహంగా పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు.తదనంతరం వారిని జగ్గంపేట మండల గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, భవిష్యత్తులో ఎలాంటి అల్లరి చర్యలకు పాల్పడకూడదని షరతులతో కూడిన బైండ్ ఓవర్ చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల...