విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా కొవ్వూరు పట్టణంలోని మెరకు వీధి రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి వేడుకలలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి గరికి పూజ 108 రకాల మహా నైవేద్యాన్ని సమర్పించారు. మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారికి గరిక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో రౌండ్ రామాలయం యూత్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు