జగన్‌కు “ప్రైవేటు సైన్యం” సెక్యూరిటీ !
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, ఆంధ్రప్రదేశ్
పోలీసుల్ని మోహరిస్తే అంత మందిని ఎందుకు పెడుతున్నారని,తక్కువ మందిని పెడితే సెక్యూరిటీ ఇవ్వలేదని సాకులు చెబుతున్న జగన్ .తనకు ఎంత సెక్యూరిటీ కావాలో తానే డిసైడ్ చేసుకున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వారి భద్రత మధ్యనే తన పర్యటనలు ఉండేలా చూసుకోవాలని డిసైడయ్యారు. అధికారం కోల్పోయిన తరవాత జగన్ కొంత మంది బౌన్సర్లను తన ఇంటి వద్ద పెట్టుకున్నారు. అలా తన పర్యటనల్లో కూడా వారు ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో తనకు జడ్ ప్లస్ భద్రత ఇవ్వడం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేశారు.
ఆయనకు సీఎం కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని వందల మంది పోలీసుల్ని మోహరిస్తున్నామని...