జగ్గంపేట :విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడా క్రికెట్ బెట్టింగులు, కోడిపందాలు ,బొమ్మ బొరుసు, గుండాటలు వంటి ఎటువంటి జూద క్రీడలు జరగటానికి వీలు లేదని జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది .ఆదివారం జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామ శివారులో జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు మరియు వారి సిబ్బంది పేకాట రాయుళ్లు మీద దాడి చేశారు .ఈ దాడిలో 5 మంది పేకాట రాయుళ్లు నుఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5100 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.ఎవరైనా జగ్గంపేట...