విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
రాజీమార్గమే రాజ మార్గమని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. జాతీయ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాలతో మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణం నందు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3 బెంచ్ లను ఏర్పాటు చేసారు .ప్రీ లిటిగేషన్ కేసులపరిష్కర నిమిత్తం మొదటి బెంచ్ కు సంస్థ చైర్మన్ 9 వ అదనపుజిల్లా జడ్జి ఎం .అనురాధ , న్యా య వాది...