14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా

మాజీ చైర్మన్ ప్రకాష్ పరామర్శ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట 12 వార్డు లో ఇటీవల మృతి చెందిన బీరక వీర మల్లయ్య కుటుంబ సభ్యుల ను మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలచర్ల బ్రహ్మాజీ, యర్రమాటి సత్యనారయణ, సిరంగి ఈశ్వర్ రావు, దొంత్తం శెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు

అగ్నిప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు మృతి

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిట్టూరి యామిని,లింగం వెంకట కృష్ణ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో ఇటీవల బాణాసంచా కర్మాగారంలో జరిగిన విస్ఫోటనం లో మృతుల సంఖ్య పదికి చేరింది. సంఘటన లో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి సావరం కి చెందిన చిట్టూరి యామిని, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (చినబాబు) లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాద తీవ్రత తో ఘటనా స్థలంలోనే నిర్వహకునితో కలిపి ఆరుగురు సజీవదహనం కాగా, గాయపడిన నలుగురు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందడం ఆవేదన కలిగించే విషయం.

డాక్టర్ చల్లా రవికుమార్ కు మాతృవియోగం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట జనవిజ్ఞాన వేదిక నవ్యాంధ్ర రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడు, మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ చల్లా రవి కుమార్ మాతృమూర్తి లక్ష్మి (81) కన్నుమూశారు. శనివారం రాత్రి 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా స్వర్గీయ లక్ష్మి భౌతిక కాయాన్ని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా కోశాధికారి కామ్రేడ్ కే కృష్ణవేణి, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, లయన్ కురసాల వీర వెంకట సత్యనారాయణ, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు అద్దేపల్లి వీర్రాజు తదితరులు భౌతిక కాయనికి నివాళులర్పించారు

జిల్లా బిజెపి అధ్యక్షునికి ముస్లిం మైనార్టీల సత్కారం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట టిడిపి ముస్లిం మైనార్టీ లు జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ను సత్కరించారు.మండపేట లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మండపేట కలువపువ్వు సెంటర్ లోని జామియా మస్జిద్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ షాప్ కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ను మండపేట తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండి కరీం ఖాదరి స్వాగతం పలికి దుశాలువతో సత్కరించారు.జాతీయ అధికారిక భాష హిందీ సలహా కమిటీ సభ్యులు షంసు సాదిక్, చాట్రాతి జానకి రాంబాబు లొల్ల,బీజేపీ రాజోలు నియోజకవర్గం కన్వీనర్ అడబాల...

అక్రమ బాణాసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవు

కొద్దిపాటి నిల్వలైనా ప్రమాదకరంగా మారవచ్చు బాణాసంచా అక్రమ నిల్వలు గుర్తిస్తే 112 లేదా 100 కు సమాచారం అందించాలి. రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మీడియా ద్వారా, దీపావళి పండుగ సందర్భంగా, ప్రజల భద్రత దృష్ట్యా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఇళ్ళ వద్ద బాణాసంచా తయారీ లు చేపట్టినా, ఇంట్లో బాణాసంచా నిల్వ చేసినా సమాచారం ఇవ్వాలని , అమ్మకాలు, తయారీకి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా...

ఆటో డ్రైవర్ ను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్

శెట్టి బలిజ సామాజిక వర్గ నేతలతో కలిసి బాధితులకు పరామర్శ నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి.. విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం మద్యం మత్తులో ఆటో డ్రైవర్, ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో బాధితులైన వాసంశెట్టి రామకృష్ణ, అనుసూరి అన్నపూర్ణ తదితరులను మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మంగళవారం వి.సావరం గ్రామంలో వారి గృహం వద్ద పరామర్శించి,వారిని ధైర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన నిందితుల నేర స్వభావానికి నిదర్శనమని ఇట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదని, నిందితుల వెనుక ఉన్నది ఎంతటి పెద్ద...

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్ల నిరసన

ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశావర్కర్ల నిరసన కార్యక్రమం ఆరోగ్య కేంద్ర సిబ్బంది కి వినతిపత్రం అందజేత విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లు గా మార్పు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కోరుతూ,మండల కేంద్రమైన రాయవరంలో గల స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల యూనియన్ లీడర్ జి.దుర్గ ఆద్వర్వంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ దుర్గ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవు, క్యాజువల్ శెలవులు, మెడికల్ శెలవులు వంటివి తమకివ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ లు తమకివ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశా లకు...

ఆటోడ్రైవర్, ప్రయాణికుల పై దాడి చేసిన నిందితుల అరెస్ట్

ఘటన జరిగిన 48 గంటలలోపే కేసును చేధించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందనలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం ప్రయాణికులతో వస్తున్న ఆటోను అడ్డగించి ఆటోడ్రైవర్ , ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో నిందితులైన శాఖా వినయ్ వంశీ, మాచవరపు వెంకట సాయి గణేష్, రిమ్మలపూడి శ్రీ సాయి కృష్ణ, పర్వతిని మౌళి సాయి క్రిష్ణ లను మంగళ వారం అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించినట్లు మండపేట రూరల్ సీఐ దొర రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 06 సోమవారం ఉదయం 3.30 గంటలకు వెదురుపాక సావరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వాసంశెట్టి రామకృష్ణ, తన బందువులైన అనసూరి శ్రీనివాస్...

మానవత్వం మరిచిన మానవతా తీరు

కిలోమీటర్ల మేర మండుటెండలో విద్యార్థులతో సైకిల్ యాత్ర చేయించిన వైనం ఆట బొమ్మల్లా మారిన హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో తమ సంస్థ ప్రచార కార్యక్రమాలు ప్రమాదకర రహదారులలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం మండలంలో అధ్వాన్నంగా మారిన విద్యాశాఖ విద్యాశాఖాధికారి ని పట్టించుకోని పాఠశాలలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం తమ సంస్థ ఉనికి చాటుకోవడానికి తమ సొంత పాఠశాల విద్యార్థులను ప్రక్కన పెట్టి, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్న పరిస్థితి మండల కేంద్రమైన రాయవరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన విశ్వం మానవతా సంస్థ. తమ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు, అవగాహన చర్యలు చేపడుతున్నామని పలువురికి చూపించుకునే ప్రయత్నం లో ర్యాలీ లు నిర్వహించగా ,...

జిఎస్టి తగ్గింపు తో రైతులకు అందుబాటులో వ్యవసాయ పరికరాలు

లొల్ల గ్రామంలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వరి కోత ప్రయోగాల పై రైతు సేవా కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తగ్గించిన జి.ఎస్.టి ధరలతో అన్ని వస్తువులతో పాటు వ్యవసాయ పరికరాల ధరలు సైతం తగ్గాయని రాయవరం మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, రాయవరం మండలం, లొల్ల గ్రామంలో జరిగిన సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా  వ్యవసాయ పరికరాల పై తగ్గిన పన్ను వివరాలను రైతులకు  వివరిస్తూ, జిఎస్టి తగ్గింపు ద్వారా వ్యవసాయ పరికరాల ధరలలో మార్పులు సంతరించుకోవడం ద్వారా వ్యవసాయానికి...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo