పాదచారులు,ద్విచక్ర వాహనదారులు,విద్యార్థులకు సైతం తప్పని తిప్పలు
పరిష్కారం చూపించాలని స్థానికుల గగ్గోలు
రాయవరం
కొంతకాలం క్రితం రహదారి పరిస్థితి ఈ విధంగా ఉండేది అని చెప్పడానికి, ఆనవాలుగా ఈ భాగాన్ని మరమ్మత్తులు చేయకుండా వదిలి పెడుతున్నారా.? అన్నట్టుగా కనబడుతుంది ఈ రహదారి భాగం. మండల కేంద్రమైన రాయవరంలోని టెలిఫోన్ ఎక్ఛేంజ్ కార్యాలయం ఎదుట ఉన్న రహదారిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి కొంతకాలమే గడుస్తున్నప్పటికీ, నాణ్యతా లోపమో, నాసి రకపు పనితనమో కారణం ఏదైనా కావచ్చు కానీ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతుంది, కొన్ని రోజుల క్రితమే పలు ప్రాంతాల్లో రహదారి పాడవగా, సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించగా, ఆనతి కాలంలోనే ఈ భాగం పాడవడంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రహదారిలో ముఖ్యంగా...