నిర్మలా హైస్కూల్ లో తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం
విజయవాడలో ఘనంగా స్కూల్ పేరెంట్స్ మీట్
భవిష్యత్తు నిర్మాణానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జట్టు ప్రయాణం
స్కిల్ ఇండియా, హైకోర్టు అతిథుల స్ఫూర్తిదాయక సందేశాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, విజయవాడ
పటమట నిర్మలా హైస్కూల్ లో గురువారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన చర్చల్లో భాగస్వాములు అయ్యారు. పరస్పర సహకారం ఫలితంగా ప్రభుత్వ సూచనల అమలు సజావుగా కొనసాగింది.
తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కిల్ ఇండియా మిషన్ కన్సల్టింగ్ అడ్వైజర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ కేసి శివ శంకర్, నిర్మలా హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మాథ్యూ, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్...