అమలాపురం
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి పటిష్టమైన చర్యలు గైకొనా లని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎంపీడీవోలను నియోజకవర్గం ప్రత్యేక అధికారులను తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి 22 మండలాల ఎంపీడీవోలు తాసిల్దార్లు మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ భారీ వర్షాలు వరదలను ఎదుర్కొనేం దుకు సన్నద్ధత చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ శనివారం బ్యాంకుల నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్మును విత్డ్రా చేస్తూ శనివారం రాత్రి నుం డి సోమవారం ఉదయం వరకు ఫీల్డ్ ఫంక్షనరీస్ మీద నమ్మకంతో నిధులు భద్రప...