14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

తూర్పుగోదావరి జిల్లా

జూనియర్స్ కబడీ సెలెక్షన్స్ కి వర్షం దెబ్బ

- మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్ - హాజరైన 19మండలాల క్రీడాకారులు - రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి.. - బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్...

నూతనంగా మంజూరైన అంబులెన్సు ప్రారంభం

వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది - ఎమ్మెల్యే ముప్పిడి విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త ఏ ఎల్ ఎస్ అంబులెన్స్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏ ఎల్ ఎస్ అంబులెన్స్‌ను ముప్పిడి వెంకటేశ్వర రావు...

అనధికారక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి –  మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు అనధికారక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనుటకు 139 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లే అవుట్ లను క్రమబద్ధీకరించుకునేందుకు అక్టోబర్ 23వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించిందని, లేఅవుట్ యజమానులు ప్రభుత్వం కల్పించిన ఎల్టిపిఓల ద్వారా అనధికారిక లేఔట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, దళారీల ద్వారా ఎల్టిపివోలు చేయించుకొని మోసపోవద్దని అన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ ద్వారా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, మైక్ ప్రచారాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం...

సెప్టెంబర్ ఒకటో తారీఖున బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాజమండ్రి రాక

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి విచ్చేస్తున్న సందర్భంగా బిజెపి నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి, కొవ్వూరు మండల ఇన్చార్జ్ చెట్టుపల్లి శివ నాగరాజు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని గురువారం బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ నాగరాజు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో బిజెపి పార్టీ ఎంతో బలోపితంగా ఉందని, కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని బూత్ కమిటీ సభ్యులను కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని తెలుపుతామన్నారు. ఈ...

అంగరంగ వైభవంగా కొవ్వూరు ఏఎంసి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి ప్రమాణ స్వీకార మహోత్సవం 

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ గా నాదెళ్ల శ్రీరామ్ చౌదరి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం చాగల్లు మండలం చాగల్లు నుంచి పంగిడి దొమ్మేరు మీదుగా బైక్, కార్లు, ట్రాక్టర్ల ర్యాలీతో కొవ్వూరు పట్టణంలోని పరిమి కళ్యాణమండపంలో ఏఎంసీ చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తుందని, పార్టీకి అండగా ఉంటూ కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న వారికి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదని తెలిపారు. యువకులను ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు...

రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించిన కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు డివిజన్ పరిధిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు - ఆర్డీవో రాణి సుస్మిత   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా లో రెండు మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. మంగళవారం, బుధవారం, గురువారం మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్న నేపథ్యంలో మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం, మండలంలోని పలు ప్రాంతాలను ఆర్డిఓ రాణి సుస్మిత సందర్శించారు. ఈ...

దొమ్మేరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర వేడుకలు

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు ఎందరో మహనీయుల త్యాగ ఫలాలతో వచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఉల్లాహ్ అన్నారు. శుక్రవారం దొమ్మేరు గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేశారని స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారని అన్నారు. కుల మత పేదలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని దానికి కారణం జాతిపిత మహాత్మా గాంధీ చలవే అని అన్నారు.ఈ కార్యక్రమానికి చాగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టా సుబ్బారావు ,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo