- మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్
- హాజరైన 19మండలాల క్రీడాకారులు
- రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి..
- బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్...