భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల పోటీలు
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం సంస్కృత కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జి వి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు సంయుక్తంగా కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించాలనే సంకల్పంతో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి దేశం పట్ల భక్తి గౌరవాలను పెంచుకునే...
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనీ తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే...
ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా నాళం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
సంపాదనే కాకుండా సమాజ సేవలు చేయడంలో ఆర్య వైశ్యులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుక మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా జరిగింది ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యదర్శిగా కాకి అనిల్ సూర్య, కోశాధికారిగా కంకటాల రాంబాబు, వాసవి ఆర్గనైజింగ్ కన్వీనర్ గా పెరుమాళ్ల వీరేశ్వర రావు, గౌరవ అధ్యక్షులుగా మట్టే వరప్రసాద్, మద్దుల సోమరాజు నాని, ముఖ్య సలహాదారులుగా మద్దుల సత్యనారాయణ లచే ఉమ్మడి...
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఎనిమిది, తొమ్మిది, పది వార్డులలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్ వర్క్ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని డ్రైనేజీలలో చెత్తను వేయడం వల్ల చెత్త పేరుకుపోయి డ్రైనేజీలలో ము రుగునీరు నిలిచి ఉండిపోవడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులోనూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నారని అయినప్పటికీ ప్రజలు చెత్తను రోడ్డుపైన డ్రైనేజీలలో వేయడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఖాళీ స్థలాలలో...
సమాజంలో అవసరతలను గుర్తించి మరిన్ని సేవలను అందించడంలో లైన్స్ క్లబ్ ముందుంటుంది - లైన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
సమాజంలో అవసరతలను గుర్తించి మరిన్ని సేవలను అందించడంలో లైన్స్ క్లబ్ ముందుంటుందని లైన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు జిల్లా గవర్నర్ జోన్ సలహా సమావేశం నిర్వహించారు. జోనల్ పరిధిలోని కొవ్వూరు దేవరపల్లి తాళ్లపూడి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో జోన్ చైర్పర్సన్ ఎనమదల సుబ్రమణ్యం మాట్లాడుతూ లైన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సమాజంలో వివిధ సేవలను అందించడం జరిగిందని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు...
జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఘన స్వాగతం పలకాలి - ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
సారథ్యం అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలకాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గౌతమి నగర్ నందు 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ నివాసం వద్ద కొవ్వూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా తయారు...
లబోదిబో మంటున్న భాదితులు
తిరుగుడుమెట్టలో కలకలం
విశ్వం వాయిస్ న్యూస్, తాళ్లపూడి
తాళ్లపూడి మండలం టి.మెట్ట గ్రామం లో చిట్టీల వేస్తూ కిరణ వ్యాపారం చేస్తున్న బెల్లంకొండ సత్యనారాయణ అనే వ్యక్తి భార్య తో సహా పరారయ్యారు. దీనితో టి.మెట్టలో చిన్న పెద్ద కుటుంబాల జనం లబో దిబొ మంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ లు గ్రామానికి రావటం, తమ డబ్బులు దాచుకున్న వారు గగ్గోలుంపెడుతూ రోడ్డెక్కటం మొత్తం మీద గ్రామం అంతా గంధర గోళం గా మారింది. వడ్డీ వస్తుందని కొంత మంది ఒకరికి తెలియకుండా ఒకరు బెల్లంకొండ సత్యనారాయణకు అప్పులిచ్చామని, చిట్టి పాడుకున్నా డబ్బునివ్వలేదని పలువురు మహిళలు సైతం వాపోతున్నారు. పఱరైన బెల్లంకొండ తో భార్య కూడా వెళ్లిపోయిందని, బాకిల వాళ్ళు...
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం - ఆర్డీవో
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
“మీ కోసం” కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత సూచించారు. సోమవారం స్థానిక కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ - మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీవో రాణి సుస్మిత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, మొత్తం ఈరోజు 21 అర్జీలు పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. వారంలో రెండు రోజులు సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు....
కొవ్వూరు నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నులు వారి సత్రం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు...
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
నూతన కార్యవర్గం నీతి నిజాయితీలతో పనిచేస్తూ సంస్థ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఉన్న నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా బాల దారి ఉమాపతి,తురగా విజయ భాస్కరరావు, తమ్మిర్సి అంజిబాబు, దివిలి సత్యవాణి, కడదారపు నాగమణి, కొల్లి సుజాత, ముప్పన లోకేశ్వర సాంబ శౌర్య, మాదిరెడ్డి కృష్ణవేణి, లచే ఏవో బాలకృష్ణ...
శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్
కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠ
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం ఐ పంగిడిలో ఆదివారం శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ కార్యవర్గం ఎన్నికలు సాయిబాబా గుడి ప్రాంగణంలో బ్యాలెట్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్ గెలుపొందారు. కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు .ఈ పోలింగ్ లో 85మంది లారీ యజమానులు ఓటింగ్...