దళిత యువకుడి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డిఏడుకొండలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు, సుంకరపాలెం
దళిత యువకుడు దోనుపాటి మహేష్ పై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని బుధవారం సుంకరపాలెం బాబా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధార్థ స్టూడెంట్ యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులో...