అమలాపురం
నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించడానికి ఎంతగానో కృషిచేసిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి అపద వచ్చిన ప్రతి సందర్భంలో వారిని రక్షించడానికి మంత్రి నారా లోకేష్ ముందుంటారని మరోమారు ఈ సంఘటనతో రుజువైందన్నారు. నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంత్రి లోకేష్ స్పందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మంత్రి తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని మరీ సచివాలయంలోనే ఉండి రియల్టైం గవర్నెన్స్ సెంటర్...