రామచంద్రపురంలో న్యాయవాదులు బైక్ ర్వాలి
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మధ్య వర్తిత్వం మేలు అంటూ మోటార్ సైకిల్ ర్యాలీ లోక్ అదాలత్ ఛైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీ చేయదగ్గ కేసుల్లో కక్షిదారులు వ్యయ ప్రయాసలకు లోను కాకుండా వారికి రాజీమార్గమే రాజమార్గం అని మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయని అన్నారు. కక్షిదారులు పట్టుదలకు పోకుండా మంచి ఆలోచన చేసినట్లయితే సత్వరమే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిపి. లకానీ పద్మ కమల కుమారి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు వరహనరసింహమూర్తి,...