విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
ఉభయగోదావరి జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలు వాటి చరిత్ర సామాజిక సేవ, సాహితీ సేవ వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఉభయ గోదావరి జిల్లాలోని ప్రముఖ క్రైస్తవ సంఘాల సాహిత్య సామాజిక సేవలు అనే అంశంపై మద్రాసు క్రైస్తవ కళాశాల భాషా విభాగాల అధిపతి ఆచార్య శ్రీపురం యజ్ఞ శేఖర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీ ని అందించిందని పరిశోధన చేసిన మరపట్ల రాజు తెలియజేశారు. తూర్పు మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న చారిత్రాత్మకమైన క్రైస్తవ సంఘాల స్థాపన పాచ్చాత్యుల కృషి, వారు నిర్మించిన విద్య, వైద్యాలయాలు, కళాశాలలు మరియు వారిచే ప్రచురించిన సాహిత్యం, వారు సమాజానికి చేసిన...