కాట్రేనికోన మండలం
తన చిన్ననాటి నుంచి ఆమె తండ్రి పోలీసుగా దొంగలను పట్టుకోవడం దగ్గరి నుంచి గమనించిన ఆ చిన్నారి తను కూడా పెద్దయ్యాక తన తండ్రిలాగే ఎప్పటికైనా పోలీస్ కావాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. అక్కడితో ఆగకుండా డిగ్రీ పూర్తి అయినప్పటి నుంచి పోలీస్ ఉద్యోగం సాధించేందుకు అహర్నిశలు శ్రమించింది .ఎంతో కష్టపడి చివరకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది ఆ యువతే సంసాని జ్యోతి. కాట్రేనికోన మండలం నడవపల్లి కి చెందిన సంసాని జ్యోతి డిగ్రీ వరకు చదివింది. ఆమె తండ్రి సంసాని శ్రీనివాసరావు కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. తల్లి సత్యవేణి గృహిణి. తండ్రిలా పోలీస్ కావాలని లక్ష్యంతో ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి త్రుటిలో...