పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి
విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం
రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆర్డీవో దేవరకొండ అఖిల పరిశ్రమల యాజమాన్యాల సంబంధిత అధికారులకు సూచించారు.స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం సంక్షోభ నివారణ కమిటీ లోకల్ క్రైసిస్ గ్రూప్ సమావేశం ఆర్డిఓ అఖిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమల సమీపాన ఉంటున్న ప్రజలకు ఆయా పరిశ్రమలల్లో సంభవించే ప్రమాదాలపై పూర్తి అవగాహన కల్పించాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు.అలానే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాకినాడ కే.రాంబాబు మాట్లాడుతూ ప్రమాదకర కర్మాగారాలలో తీసుకోవల్సిన భద్రతా ప్రమాణాలు,ఈ కమిటీ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లు,అగ్నిమాపక అధికారులు,మెడికల్...