సుప్రీంకోర్టు ఇటీవల ఆస్తిపై నాకు ఆర్డర్ కూడా ఇచ్చింది
ముత్య మాధురికి, సాల్మన్ రాజుకు ఆ పామాయిల్ తోటపై ఎలాంటి హక్కు లేదు
వారినుంచి నాకు ప్రాణహాని ఉంది
దౌర్జన్యంగా పామాయిల్ గెలలు కోసుకుపోతున్నారు
నా ఆస్తి నేను పొందకుండా ముత్య మాధురి, సాల్మన్ రాజుఅడ్డుపడుతున్నారు
అందుకే పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి కూలీలపై కేకలు వేసుంటారు
మీడియాతో పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రంగంపేట మండలం ఈలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని,వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు,ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు ఆమె తన తండ్రి టి.వి.వి.సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.నురుకుర్తి సాల్మన్ రాజుతో...