పోలేకుర్రులో సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన టిడిపి నేతలు
తాళ్ళరేవు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ లో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి వార్డు పరిధిలోని ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఒకవేళ ఎవరికైనా ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందలేకపోయినట్లైతే దానికి కావలసిన డాక్యుమెంట్లు వివరాలను నాయకులు తెలియజేశారు. ప్రభుత్వం త్వరలో ఇంకా అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరాలు తెలియజేసి అవగాహన కల్పించారు . తల్లికి వందనం పథకంలో అర్హులైన వారందరికీ...