ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలి: రాష్ట్ర విశ్వజన కళా మండలి అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు
తాళ్ళరేవు
ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు యూనిఫామ్ విద్యాసామాగ్రి సైతం తమ వద్దే కొనాలని నిబంధనలు పెట్టడం చాలా దారుణమని అన్నారు .కార్పొరేట్ విద్యాసంస్థలు జారీ చేస్తున్నాయి తప్పక తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు, తల్లిదండ్రులకు తెలిసినా కూడా తమ పిల్లలను ఇబ్బంది పెడతారని ఒక కారణంగా అడగలేకున్నారు . మధ్యతరగతి ప్రజలు ఇటు ప్రైవేటు పాఠశాలలకు పంపలేక అటు...